Tuesday 2 June 2020

తెలంగాణ అవతరణ దినోత్సవం- ప్రగతి లో వెనక పడ్డామా?

తెలంగాణ అవతరణ దినోత్సవం- ప్రగతి లో వెనక పడ్డామా?

తెలంగాణ ఒక రాష్ట్రంగా ఎం సాధించామన్నది ప్రభుత్వ ప్రసార మాధ్యమాల ద్వార తెలుసుకుంటున్నాము. అయితే 2014-2020 వరకు ఈ 6 సంవత్సరాల్లో ప్రభుత్వ పనితీరుని విశ్లేషిస్తే, కీలక రంగాల్లో వెనుక పడ్డామనే అనుకోవాలి. అదెట్ల అంటె,

1. ఆరోగ్యం

రాష్ట్ర బడ్జెట్ లో ఈ రంగానికి గత 6 సంవత్సరాల్లో ఎవరేజ్ కేటాయింపులు 4% మాత్రమే.
• Expert committees సూచించింది ఏటా 15%
• డిల్లి లో 14% కేటాయిస్తున్నారు

తక్కువ  కేటాయింపులు పర్యావసనం


• తెలంగాణ రాష్ట్రంలో 9300 జనాభాకు 1 డాక్టర్ మాత్రమే ఉన్నాడు (WHO 1:5000 నిష్పత్తిని ప్రతిపాదించింది); డిల్లిలో 1:2200 గా ఉంది
• ప్రభుత్వ ఆస్పత్రుల అధ్వాన పరిస్తితి వల్ల గత సంవత్సరం దోమల కాటుకు డెంగీ బారున పడి 100 మంది చనిపోయినరు

2. విద్య - రాష్ట్ర బడ్జెట్ లో ఈ రంగానికి గత
6 సంవత్సరాల్లో ఎవరేజ్ కేటాయింపులు 8% మాత్రమే.
• కొఠారి కమిషన్‌ 25-30% ప్రతిపాదించింది
• దేశంలోని అన్ని రాష్ట్రాల నేషనల్‌ ఎవరేజ్ 16%
• డిల్లి 27% కేటాయిస్తున్నారు
• తెలంగాణ అట్టడుగు స్థాయిలో ఉంది

తక్కువ  కేటాయింపులు పర్యావసనం


• తెలంగాణ రాష్ట్ర Literacy Rate - 66% మాత్రమే (జాతీయ నిష్పత్తి - 74%)
• ఈ తక్కువ కేటాయింపులు కేవలం జీతభత్యాలు, పాఠశాల నిర్వహణకే సరిపోవడంవలన టీచర్ల కొరత (26k ఖాళీలు), మరుగుదొడ్డి, తరగతి గదులు, బెంచీల కొరత తీవ్రస్థాయిలో ఉన్నాయి
• M.V.Foundation, FDR వంటి సంస్థలు చేసిన అధ్యయనాల్లో తేలిందేమిటంటే, 10వ తరగతి విధ్యార్దులు 4-5వ తరగతి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు; 5వ తరగతి విధ్యార్దులు కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నారు

3. వ్యవసాయం

• దేశంలోనే తలమానికంగా తలపెట్టిన రుణ మాఫి, రైతు బంధు, రైతు భీమా వంటి పధకాలు సత్ఫలితాలను అందించడంలేదని రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చెబుతున్నాయి,             
National Crime Records Bureau లెక్కల ప్రకారం  రైతుల ఆత్మహత్యలు             
2017 - 846                         
2018-900                             
2019-908
• రైతు భీమా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2019కు రైతు మరణాలు 12,820
• రైతు ఆత్మహత్యల లెక్కల్లో తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల్లో దేశంలోనె 2 లేదా 3వ స్థానంలో ఉంది

4. సంక్షేమం పేరుతో అప్పులు, ప్రజలను తాగుబోతులను చేయడం


• 2020-21 రాష్ట్ర బడ్జెట్ లో రాబోవు ఏడాదికి గాను Rs.30 వేల కోట్ల అప్పు చేయాలని, ప్రభుత్వ భూములను అమ్మాలని, ప్రభుత్వం పేర్కొనింది
• RTC మరియు విధ్యుత్‌ చార్జీలు పెంచుతామని స్వయాన ముఖ్యమంత్రి   KCR గారు అసెంబ్లీలో చెప్పినరు
• మరోవైపు Excise నుంచి వచ్చే ఆదాయం గత 6 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉంది. అంటె ఒక చేయితో సంక్షేమం పేరుతో పేద ప్రజలకు పైసలిచ్చి, మరో చేయితో మందు తాగించి ఆ పైసలను గుంజుకుంటుంది ఈ ప్రభుత్వం
• ప్రజారోగ్యం పట్టించుకోకుండ, ఇట్ల మద్యం తాగించి ఆరోగ్య, ఆర్ధిక పరమైన ఇబ్బందులు పెంచి; కుటుంబాల్లో కలహాలు పెంచి ఆరేళ్లుగా ఈ ప్రభుత్వం ఒ పైశాచిక పబ్బం గడుపుకుంటుందా?

5. ముఖ్యమంత్రి KCR ఇదివరకు ప్రకటించి, నెరవేర్చని కీలక హామీలు,


 • KG to PG ఉచిత విద్య
 • దళితులక 3 ఎకరాల భూమి
 • ఇంటికో ఉద్యోగం చప్పున కోటి ఉద్యోగాలు
 • నగరానికి నాలుగు వైపుల 4 సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలు

మన రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటె, వచ్చే కాలంలో


విద్య-25%; ఆరోగ్యం-15% బడ్జెట్ కేటాంపులు జరగాలి

వ్యవసాయానికి 
• స్వామినాదన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలి
• మార్కెట్ వ్యవస్థను సమూలంగ ప్రక్షాళన చేయాలి
• దళితులక 3 ఎకరాల భూపంపిణి చేయాలి
• SBI Report ప్రకారం తెలంగాణలో సాగు చసేవారిలో 70% కౌలు రైతులు. కాని ప్రభుత్వం అందించే రైతు పధకాలు వీరికి వర్తించవు. అవి వర్తింపచేయాలె.

⁃ అభివృద్ధి, సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ, అప్పులు చేయకుండ, ప్రభుత్వ ఆదాయాన్నిపెంచుతూ మందుకెల్లాలి. డిల్లి ప్రభుత్వం, అప్పులు చేయకుండ, Tax, ఇతర చార్జీలు పంచకుండా, ప్రభుత్వ ఆదాయాన్ని 2014 లో 30 వేల కట్ల నుండి 2019 లో 60 వేల కట్లకు  పెంచుట సాధ్యమైనప్పుడు మన తెలంగాణలో ఎందుకు కాదు.

⁃ అది జరగాలంటె, అవినీతి మరియు దుబారా
ఖర్చు రెండూ తగ్గించాలి. అవినీతిలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే 5వ స్థానం. కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్, బుల్లెట్ ప్రూఫ్ బాత్‌రూం కట్టడాలు వంటి దుబారా ఖర్చు ఆలోచనలు మానేయ్యాలె.

జై తెలంగాణ.. జై హింద్